శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): రాచమళ్ళ రవి గౌడ్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, జిల్లా మీడియా ఇంచార్జ్ ప్రశాంత్ నేత, గణేష్, మంగుబాయ్, వనిత, శివమ్మ, సత్య తదితరులు రవి గౌడ్ ని కలిసి శాలువాతో సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నాయకులు మాట్లాడుతూ రవి గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న అనుబంధం, ప్రజలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ముందుండి సేవాభావంతో పనిచేసే వ్యక్తులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రాచమళ్ళ రవి గౌడ్ అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





