శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించినందుకు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ శనివారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు సంతోషం ఉన్నా, నా బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున పోరాడే గొంతుకై ప్రజల కోసం, పార్టీ పటిష్టత కోసం మరింత శ్రమిస్తానని , తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తానని, అలాగే తొందరలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలే లక్ష్యంగా పనిచేసి అత్యధిక డివిజన్లలో విజయం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.






