శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ నెహ్రూనగర్ మస్జీద్ ఈ నూరని వద్ద నిర్వహించిన రంజాన్ తోఫా కార్యక్రమానికి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారని అన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తూ.. ఆధ్యాత్మిక భావనతో ఈ మాసాన్ని గడుపుతారని.. ఈ నేపథ్యంలో ముస్లింలకు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ ఈ నూరని ప్రెసిడెంట్ షైక్ గఫర్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ఖాదర్ ఖాన్, గఫుర్, తహేర్, ఇర్ఫాన్, సల్మాన్, షైబాజ్, అలీం, ముక్రమ్, నసీమ్, ఇబ్రహీం, షాదిక్, జైనుద్దీన్, జావీద్, దస్తగిర్, ఖలేద్, వెంకటయ్య, స్థానిక ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






