- పి. ఆర్. కె హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ప్రాంతంలోని పి. ఆర్. కె హాస్పిటల్ లో మొట్టమొదటి సారిగా అరుదైన అత్యాధునికమైన ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ శస్త్ర చికిత్స నిర్వహించారు. రెండు రోజుల కిందట వ్యక్తి(50) తీవ్రమైన తలనొప్పితో వైద్యం కోసం పి.ఆర్.కె హాస్పిటల్ కు రాగా… పరీక్షలు నిర్వహించిన వైద్యులు తన తలలో రక్త నాళాలు ఉబ్బడం, సెరిబ్రల్ అన్యురిసంతో బాధ పడుతున్నట్లు కనుగొన్నారు.
తలలో రక్త నాళాలు చిట్లి మెదడులో రక్త స్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెల్లినట్లు తెలిపారు. సర్జరీ చేసి ఆ రక్తనాళానికి క్లిప్పింగ్ చేయాల్సి వుంటుందని తెలిపారు. అత్యాధునిక రీతిలో ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ పద్దతిని ఉపయోగించి రోగిని ప్రమాదం నుంచి గట్టెంకించారు. ఈ సర్జరీతో పోలిస్తే పేషెంట్ కోలుకునే సమయం చాలా వేగంగా వుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన పి. ఆర్. కె వైద్య బృందానికి, ఎం డి డాక్టర్ పి. రవికుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ పద్దతి విజయవంతంగా నిర్వహించినందుకు వారికి అభినందనలు వెల్లువెత్తాయి.