విద్యా దానం మహాదానం: 8 వ బెటాలియన్ కమాండెంట్ మురళి కృష్ణ

  • ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి: మాజీ శాసన సభ్యులు ఎం. భిక్ష‌ప‌తి యాద‌వ్
  • విద్య తోనే అన్ని సాధ్యం: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ర‌వికుమార్ యాద‌వ్
  • 2వ రోజు కొనసాగిన ఉచిత నోటు పుస్త‌కాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: రెండోరోజు విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణి కొనసాగింది. సంద‌య్య మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ సహకారంతో శేరిలింగంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్ష‌ప‌తి యాద‌వ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాద‌వ్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ ప్రభుత్వ పాఠ‌శాల‌, లింగంప‌ల్లి డివిజన్ లోని మసీద్ బండ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత నోటు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 8వ బెటాలియన్ కమాండెంట్ మురళి కృష్ణ పాల్గొని ఉచితంగా నోటు బుక్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం స‌హ‌క‌రిస్తున్న భిక్ష‌ప‌తి యాద‌వ్ ని, ర‌వికుమార్ యాద‌వ్‌ను అభినందించారు. ట్ర‌స్ట్ ద్వారా పేద వారికి ఉచిత విద్య‌, వైద్యానికి సాయం చేశార‌ని తెలిపారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్ష‌ప‌తి యాద‌వ్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌దివితే రానున్న‌ జీవితంలో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ర‌వి కుమార్ యాదవ్ మాట్లాడుతూ పిల్లలు తమ విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్త్వం అలవరచుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంచుకోవడంతోపాటు ఆరోగ్యకరమయిన సమాజం నిర్మించటంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మసీదు బండ పాఠ‌శాల‌ ప్రధానోపాధ్యాయులు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేవని తెలపగా.. మారబోయిన సదానంద యాదవ్ స్పందించి వెంటనే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోవింద్, నీలం కృష్ణ, నరసింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, వినోద్ రావు, మల్లేష్, ఆంజనేయులు సాగర్, సుమన్, గోపాల కృష్ణ, రాజు, పద్మ, వినితా సింగ్, మేరీ, పార్వతి, నాగులు, మల్లీశ్వరి, రవి నాయక్, కిరణ్, వినయ్, ప్రకాష్, నరేష్, మల్లేష్, చెన్నయ్య, రమేష్ రెడ్డి, సాగర్, అరుణ్, కుమార్, శ్రీకాంత్, నవీన్ రెడ్డి, అనిల్, జగదీష్, రెహ్మతుల్లా, దేవేందర్ యాదవ్, కరణ్, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here