- శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : రాజ్యాంగ సృష్టి కర్త, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. అణగారిన వర్గాలకు, వెనుకబడిన దళిత వర్గాలకు చేయూత అందించి వారికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన గొప్ప దార్శనికుడు డా. బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్ సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని జి.హెచ్.ఎం.సి కార్యాలయం, హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్, మక్త, నడిగడ్డ తండా, సుభాష్ నగర్, హైదరనగర్ డివిజన్ పరిధిలోని హైదరనగర్, అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, ఆర్.పి కాలనీ, కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ నందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,డివిజన్ అధ్యక్షులు,మహిళ నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
