నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్య రామ మందిర నిర్మాణానికి మియాపూర్ మక్తా మహబూబ్పేట్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ రూ. 76116 నిధి సమర్పణ చేశారు. సోమవారం శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ మందిర నిధి సేకరణ కార్యక్రమంలో ఎంపి ధర్మపురి అరవింద్, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ల సమక్షంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ కి గణేష్ ముదిరాజ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రామభక్తులంతా శతాబ్దాలుగా అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కొద్దీ రోజుల్లోనే ఆ అద్భుత అవకాశం మనకు కలుగనుందని తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.