నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ భవ్య మందిర నిర్మాణానికి మియాపూర్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు సమ్మెట ప్రసాద్ రూ. 1,00,116 నిధి సమర్పణ చేశారు. సోమవారం శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ మందిర నిధి సేకరణ కార్యక్రమంలో ఎంపి ధర్మపురి అరవింద్, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ల సమక్షంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ కి సమ్మెట ప్రసాద్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సమ్మెట ప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.