నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్న సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుక్రవారం గోపనపల్లిలోని రంగనాధ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మసీద్ బండకు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.