సోదర, సోదరిమణుల అనురాగానికి సంకేతం రక్షా బందన్ : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారిస్ సోదరీమణులు ప్రభుత్వ విప్ గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధాన్నీ చాటారు.

ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ విప్ గాంధీ రక్షా బందన్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కతమ్ముళ్ల , అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక.. సోదరుడు సోదీరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని, అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసా భావన రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here