మట్టి వినాయకుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : పర్యావరణ పరిరక్షణ కోసం సహజ సిద్ధమైన రంగులతో, మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజిద్దామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీతోపాటు పలు కాలనీలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందించారు. అనంతరం రామయ్యనగర్ కాలనీలో స్వర మహతి కళాపరిషత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..మట్టి విగ్రహాల వినియోగంతో స్థానిక కళాకారులకు వృత్తి పని, లబ్ధి చేకూరుతుందని, నిమజ్జనం సమయాల్లో కూడా నీటిలో జీవించే జీవరాసులకు మేలు చేకూర్చిన వారమావుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరాజ్ ముదిరాజ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఆదర్శ్ నగర్ కాలనీ వాసులు శివయ్య గౌడ్, ప్రసాద్, మహేష్, రాంనాథ్, రాంకీ, స్వరూప రాణి, దీప, సుజాత, వీణ, రామయ్య నగర్ కాలనీ రాణి స్వర్ మహతి కళాపరిషత్ ప్రెసిడెంట్ డా. ఆదిత్య కిరణ్, శ్రీనివాస్, లక్ష్మణ్, రమణ, వెంకట్ లక్ష్మి, రేవతి, దేవులపల్లి కుమార్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here