స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం మన బాధ్యత : మల్లికార్జున్ శర్మ

నమస్తే శేరిలింగంపల్లి : బైరాన్ పల్లి గ్రామం దులిమిట్ట మండల్ సిద్దిపేట్ జిల్లాలోని  స్వాతంత్ర సమరయోధులకు ఘన సన్మానం లభించింది. వారికి  పూల దండలు వేసి శాలువాలతో సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించుకోవడం మన బాధ్యత అని తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమ నాయకుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి పట్టణ ప్రథమ అధ్యక్షులు  మల్లికార్జున్ శర్మ అన్నారు.

అనంతరం సిద్దిపేట జిల్లాలోని బైరన్ పల్లి చేరుకొని నిజాం కాలంలో రజాకారుల  ఆరాచకాలకు గురై ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బైరన్ పల్లిలోని రజాకారుల దాడులకు గురయిన తెలంగాణ స్వతంత్ర సమరయోధులు చల్ల చంద్రారెడ్డి, ఇమ్మడి రామ్ రెడ్డి, జేమునూరి కొమురయ్య, ఇమ్మడి ఆగం రెడ్డి, ఇమ్మడి లింగారెడ్డి, రంగు లింగయ్య, ఇమ్మడి ఆగం రెడ్డి, పులిగిల్ల ఓజవ్వ, ఉలంగ సత్తవ్వ, కాలే లచ్చవ్వలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ శర్మ మాట్లాడుతూ తెలంగాణలోని  తెలంగాణ స్వతంత్ర సమరయోధులను సెప్టెంబర్ 17 సందర్భంగా వారిని ప్రతి సంవత్సరం సన్మానిస్తున్నట్లు తెలిపారు. గత 40 ఏండ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. స్వతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ సన్మానించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఎం. శివకుమార్, బిఆర్ఎస్ నాయకులు గజ్జల శ్రీనివాస్, పల్లపు యాదయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here