నమస్తే శేరిలింగంపల్లి : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బా ఫూలే చేసిన సేవలు అమోఘమని, భారత ప్రప్రథమ సామజిక తత్వవేత్త , మొట్టమొదటి సంఘ సంస్కర్త, సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫూలే కార్యాచరణ మహోన్నతమైనదని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ప్రభాకర్, హరినాథ్, బాబు రావు, లింగయ్య, చంద్రమోహన్ సాగర్, ఆంజనేయులు, ప్రవీణ్, కృష్ణ, సత్యనారాయణ, సాయి బాబా, వెంకన్న, ఆనంద్, చంద్రయ్య, బాబు, సోమయ్య, సంతోష్, హరి, రవి, కాలనీవాసులు, స్థానికులుపాల్గొన్నారు.