నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కి చెందిన యాదగిరికి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశలవారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని తెలిపారు. దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద కార్ ను పొందిన లబ్ధిదారుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గార్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి SC సెల్ అధ్యక్షుడు రఘునాథ్, తెరాస నాయకులు కృష్ణ ముదిరాజు, నాగరాజు, గోపాల్, సీతారాం పాల్గొన్నారు.