- ఎంసిపిఐయూ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కామ్రేడ్ వనం సుధాకర్
నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐయూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్, ముజాఫర్ అహ్మద్ నగర్ లో రెండో రోజు సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసిపిఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో బిజెపి పార్టీ తన మతోన్మాద విధానాలను అవలంబిస్తూనే ప్రజలపై అనేక రకాలుగా ధరల భారాన్ని, జిఎస్టి రూపంలో ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేద, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మౌలిక వసతులు కల్పించకుండా మరింత సమస్యల సుడిగుండంలో నెట్టడానికి పరిపాలన చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనేక రకాలుగా పీడించే విధానాలను సృష్టిస్తూ దోపిడి వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. ఎంసిపిఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులలో ఎంసిపిఐయూ పార్టీ సభ్యులు 50మంది పాల్గొన్నారు.