చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చందానగర్ పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ లోని టాటా మోటార్స్ షోరూం సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వివరాలు తెలియవని, వయస్సు సుమారుగా 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, యాష్ కలర్ చెక్ షర్ట్, బ్లూ కలర్ లుంగి ధరించి ఉన్నాడని, విపరీతంగా మద్యం సేవించడం వల్లే చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.