బీజేపీకి అవ‌కాశం ఇస్తే హైద‌రాబాద్ అద్భుతంగా మారుతుంది : మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్

గ‌చ్చిబౌలి‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంఎసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఈసారి బీజేపీకి అవ‌కాశం ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ అన్నారు. గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు భారీ బైక్ ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ర్యాలీలో డివిజ‌న్ బీజేపీ అభ్య‌ర్థి గంగాధ‌ర్ రెడ్డితో క‌లిసి పాల్గొన్న భిక్ష‌ప‌తియాద‌వ్ మాట్లాడుతూ ప్ర‌జ‌లు బీజేపీకి ఒక్క అవ‌కాశం ఇచ్చి చూడాల‌ని అన్నారు. గ‌త ఆరున్న‌ర ఏళ్లుగా తెరాస పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ వ‌స్తుంద‌న్నారు. హైద‌రాబాద్‌ను డ‌ల్లాస్ న‌గ‌రం చేస్తార‌ని అనుకుంటే భారీ వ‌ర‌ద‌ల‌తో విషాద‌న‌గ‌రంగా మార్చార‌న్నారు.

గ‌చ్చిబౌలిలో నిర్వ‌హించిన ర్యాలీలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్

గ్రేట‌ర్‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయ‌న్నారు. న‌గ‌రంలో బీజేపీకి వ‌స్తున్న ఆద‌ర‌ణను చూసి తెరాస త‌ట్టుకోలేక‌పోతుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. గ్రేట‌ర్ ప్ర‌జ‌లు మోదీని, బీజేపీ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌న్నారు. ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే గ్రేట‌ర్‌ను భాగ్య‌న‌గ‌రంగా మారుస్తామ‌ని అన్నారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు వసంత్ కుమార్ యాదవ్, నీలం నరేందర్ ముదిరాజ్, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

భారీ సంఖ్య‌లో ర్యాలీ నిర్వ‌హిస్తున్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here