హెచ్‌సీయూలో ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య

గ‌చ్చిబౌలి‌‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఓ ప్రొఫెస‌ర్ తీవ్ర మ‌న‌స్థాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం ఉనా జిల్లాకు చెందిన ప్రొఫెస‌ర్ రిషీ భ‌ర‌ద్వాజ్ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (హెచ్‌సీయూ)లో మెడిక‌ల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వ‌ర్సిటీలోని క్వార్ట‌ర్ నం.బి-62లో నివాసం ఉంటున్నాడు. కాగా ఆదివారం త‌న క్వార్ట‌ర్‌లో రిషీ భ‌ర‌ద్వాజ్ ఉరి వేసుకుని క‌నిపించాడు. దీంతో వ‌ర్సిటీ అధికారులు గ‌చ్చిబౌలి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ మేర‌కు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు భ‌ర‌ద్వాజ్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలోనే అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here