- గజమాలతో సన్మానం
- 72 కేజీల కేక్ ఏర్పాటు
- బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు
నమస్తే శేరిలింగంపల్లి: మసిద్ బండ కొండాపూర్ బిజెపి పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు భి క్షపతి యాదవ్ 72వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, రమేష్, నరసింహ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పాపి రెడ్డి కాలనీ గోపి నగర్, నెహ్రు నగర్ నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ ను భారీ గజమాలతో సన్మానించి 72 కేజీల కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.