నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన ఉమాదేవి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 22 వేలు మంజూరయ్యాయి. CMRF చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, భగవాన్, కార్తిక్ రావు, రాంచందర్, హిమగిరి రావు, అల్లం మహేష్, చంద్రమోహన్ సాగర్, రామాకృష్ణ, చంద్రశేఖర్, విద్య సాగర్ పాల్గొన్నారు.