- ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవాని వీకర్స్ సెక్షన్, వేమన వీకర్స్ సెక్షన్ కాలనీలలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటి కి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా పరిఢవిల్లిందని, తెలంగాణ రాష్ట్రం ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టినారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని పేదలకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని, ఈ విజయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని కార్పొరేటర్ తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.