నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పాత గ్రామంలో లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందెల కుమార్ యాదవ్ పాల్గొని ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ఆరు గ్యారంటీలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ రంజిత్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాంగిర్, గఫార్, పాశం సత్యనారాయణ యాదవ్, కృష్ణ, మహేష్ గౌడ్, అనిల్, గఫార్, ప్రవీణ్, శ్రీనివాస్, శ్యామ్, పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేశారు.