నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎర్రవల్లి లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తన నివాసంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయాన్ని కేసీఆర్ కు కానుకగా ఇచ్చారు.