శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా ప్రతినిధులు, నాయకులు త్రివర్ణ పతాకాలను ఎగుర వేశారు.
మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ సీఐ వెంకటేష్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని తెరాస పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
చందానగర్ లోని సర్కిల్ కార్యాలయంలో డీసీ సుధాంష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నల్లగండ్లలోని శ్రీకృష్ణ యూత్ కార్యాలయంలో కార్పొరేటర్, శ్రీకృష్ణ యూత్ వ్యవస్థాపకుడు జగదీశ్వర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజర్ భాగ్యరావు, యాదగిరి, రాజు, సునీల్, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్, బాలకృష్ణ, మల్లేష్, బాలరాజ్, ప్రవీణ్, మనోజ్, గిరి, భాస్కర్, యూత్ సభ్యులు సతీష్, జయ సాయి, నవీన్ యాదవ్, నవీన్ ,మహేష్ పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ తెరాస పార్టీ కార్యాలయంలో కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ హమీద్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీరా డైమండ్, గోపనపల్లి ఆటో యూనియన్ అసోసియేషన్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ ల లో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
మియాపూర్‌లోని మక్తా మహబూబ్ పేటలో గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్, డివిజన్ బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర రావులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సైబరాబాద్ అడిషనల్ డిప్యూటీ కమీషనర్ క్రైమ్స్ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏసీపీ సంతోష్ కుమార్, సీఏవో అకౌంట్స్ చంద్రకళ, ఇన్ స్పెక్టర్లు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో డివిజన్ బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రాకేష్ దూబె, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, మధుసూదనరావు, శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రభాకర్, సాయికుమార్ పాల్గొన్నారు.
చందానగర్, గౌతమీ నగర్, వీఆర్ రెసిడెన్సీ వద్ద రిపబ్లిక్ డే సందర్భంగా బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కసిరెడ్డి సింధూ రెడ్డి, రాకేష్ దూబే, పర్వత్ రెడ్డి, నాంచారయ్య, కన్నారావ్, శ్రీధర్, శివకుమార్ వర్మ, రఘునాథ్ రెడ్డి, గద్దే సాయికుమార్, శ్రీనివాస్ ముదిరాజ్ కాలనీవాసులు, చిన్నారులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ ఎస్టేట్స్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్టేట్స్ అధ్యక్షుడు దొనెపూడి శివ రామ కృష్ణ ప్రసాద్ జాతీయ జండాను ఎగరవేశారు.
తారానగర్ వీకర్ సెక్షన్ కాలనీ స్కూల్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రకళ, పద్మజ దేవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. చందానగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ పాషా, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తాడిబోయిన రామస్వామి యాదవ్, జివి రావు, శివరామకృష్ణ, బాలన్న, చారి, సత్యనారాయణ, రామనాథం, మురళీకృష్ణ, మల్లారెడ్డి, అమీన్, ముజిద్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న బిజెపి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్, డిఎస్ ఆర్ కె ప్రసాద్, రవి గౌడ్, మణిక్ రావు, పార్వతి, జితేందర్, కళ్యాణ్, మహేష్ అనూష యాదవ్, శ్రీశైలం, శ్రీశైలం యాదవ్, బాబు రెడ్డి, రత్న కుమార్, జగన్, విజయేందర్, నందు, హరీష్ పాల్గొన్నారు.
హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని గంగారం హుడా కాలనీ, జనప్రియ నగర్, సాయి నగర్, ఓల్డ్ హఫీజ్‌పేట, ఆల్విన్ కాలనీలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, బోయిని అనూష మహేష్ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎక్స్ కౌన్సిలర్ రమణయ్య, రవి గౌడ్, పార్వతి జితేందర్, శ్రీశైలం యాదవ్, బాబు రెడ్డి, నరేందర్ రెడ్డి, జగన్, నవీన్ రవి ముదిరాజ్, మనోజ్ యాదవ్, రాహుల్, మృదుల, ఉమాదేవి పాల్గొన్నారు.
చందానగర్‌లోని మాధవ బృందావన్ అపార్ట్‌మెంట్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు గోవర్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కాలనీలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, గౌరవ అధ్యక్షులు కె నరసింహ యాదవ్, బాల్ రాజు నాయక్, కార్యదర్శి కుమార్ ముదిరాజ్, బాలాజీ నాయక్, గణేష్ నాయక్, రమేష్ గుప్తా, ప్రభాకర్ చారి, మౌలానా, అబ్దుల్ హక్, లక్ష్మారెడ్డి, నగేష్ నాయక్, అంజన్ రెడ్డి, ఆశ బేగం, విజయ, శ్రీకాంత్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భేరి శ్రీనివాస్ యాదవ్, భేరి చంద్రశేఖర్ యాదవ్, ఎం.నాగరాజు, లవణ కుమార చారి, లక్ష్మణా చారి, సాగర్ శర్మ, రవీందర్, రాజు ముదిరాజ్, రాజు పాల్గొన్నారు.
జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్ 5, జనప్రియ నగర్ ఫేజ్ 2, జనప్రియ రెసిడెంట్స్ సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్, జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్-4లలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
మదీనాగూడలోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీధర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆఫీస్ బేరర్లు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, రెసిడెంట్స్ పాల్గొన్నారు.
హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట యూత్ కాలనీలో ఎంఐఎం పార్టీ యూత్ నాయకులు ఇమ్రాన్ అహ్మద్, మన్నమ్, ముఖ్తార్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ దగ్గర తులసి వనం ప్రధాన రహదారిపై చిన్నారులు, స్థానిక ప్రజలకు జాతీయ జెండాలను, మొక్కలు, చాక్లెట్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవని వాలంటీర్లు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.