తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి పన్నాగం

  • టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును నిరసిస్తూ .. మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును నిరసిస్తూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపు మేరకు గురువారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్, బొల్లారం చౌరస్తా వద్ద మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వటానికి నిధుల కొరత అంటారు.. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చూడకుండా… తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. బిజెపి నాయకులు తమ స్వార్థ బుద్ధి కోసం కేసులు మాఫీ చేయించుకోవడానికి కాంట్రాక్టు ల కోసం బిజెపిలో చేరుతున్నారని, వేల కోట్ల కాంట్రాక్టులు, డబ్బులు తీసుకొని బీజేపీలో చేరుతున్నారని, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మర్రపు గంగాధర్ రావు , BSN కిరణ్ యాదవ్, రోజా, చంద్రిక ప్రసాద్ గౌడ్, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్, గోపరాజు శ్రీనివాస్, మహ్మద్ ఖాజా, స్వామి నాయక్, రఘునాథ్ రావు, మల్లేష్, కోటయ్య, తిమ్మరాజు, రవి, లక్పతి నాయక్, సంతోష్, శివ, వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, చందు , దేవేందర్, ప్రసాద్, చందు, అంజి, లక్ష్మయ్య, చంద్రపల్, నగేష్ పాల్గొన్నారు.

మియాపూర్, బొల్లారం చౌరస్తా వద్ద మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here