మురుగును నాలాలోకి కలపండి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భవాని పురం కాలనీ వీధుల్లోకి మురుగును వదలడం భావ్యం కాదని, నాలాలోకి కలపాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీ లో తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డీసీ వంశీ కృష్ణ , కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీ నుండి వచ్చే మురుగు నీరును నాలలోకి లింక్ కల్పకుండా భవాని పురం కాలనీ వీధుల్లోకి వదులుతున్నారని, నాలాలోకి కలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు కాలనీ పరిసర ప్రాంతాల్లో చేరడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లన్నీ మురుగు మయం అవుతున్నాయని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీలో పర్యటించి సమస్యను తెలుసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని, డిఈ దుర్గాప్రసాద్, ఏఈ సంతోష్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని , ఏఈ పావని, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ , సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సుందర్, రఘునందన్, రాజన్న, రమేష్ , రాములు, కాశిం మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here