నమస్తే శేరిలింగంపల్లి : ఐక్యతకు ప్రతీక గణేశ నవరాత్రి వేడుకలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. గణేష్ నవరాత్రోత్సవాలలో భాగంగా చందానగర్, మియాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వినాయకచవితి పండుగ దేశభక్తికి, ఐక్యతకు ప్రతీకగా చెబుతారని అన్నారు. గణేశ నవరాత్రి వేడుకలు చిన్నా, పెద్దా , పేద , ధనిక తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమేష్, దేవేందర్రావు, కరుణాకర్ రావు, సత్య రెడ్డి, సంతోష్ రెడ్డి, అశోక్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.