- రూ. 5 కోట్ల 06 లక్షలతో అభివృద్ధి పనులు
- కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ. 5 కోట్ల 06 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వల నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
దీప్తి శ్రీ నగర్ కాలనీ లో రూ.73 లక్షలతో సీసీ రోడ్లు, ఇందిరా నగర్ కాలనీ లో రూ.3 కోట్ల 70 లక్షలతో వరద నీటి కాల్వ నిర్మాణం, వేమన వికర్ సెక్షన్ కాలనీ లో రూ.63 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.