నమస్తే శేరిలింగంపల్లి: స్టాలిన్ నగర్ లో కామ్రేడ్ ఓంకార్ 14వ వర్ధంతి ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్టాలిన్ నగర్ లో పార్టీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎంసిపిఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఓంకార్ గారి 14వ వర్ధంతి ముగింపు కార్యక్రమం 31న ఉదయం 10 గంటలకు మియాపూర్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు హాజరవుతున్నట్లు వివరించారు. సామాజిక న్యాయ ఆలోచనపరులు, సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టాలిన్ నగర్ శాఖ కార్యదర్శి నరిశెట్టి గణేష్ సభ్యులు డి శ్రీనివాసులు, అండూరి శంకర్, దారా లక్ష్మి, నిమ్మక నాగభూషణం పాల్గొన్నారు.
