నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాగం నాగేందర్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు యాద గౌడ్, ఆర్ జి కే వార్డ్ మెంబర్ శ్రీకళ, తారా నగర్ వార్డ్ మెంబర్ కవిత గోపాల్, నెహ్రు నగర్ కాలనీ వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, తెరాస సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, గోపి నగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, లింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, సందయ్యనగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజు, కోయాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు బసవయ్య, సురభి కాలనీవాసులు కోదండరావు, సౌజన్య, భాగ్య, జయ, విజయ్, సాయి, మహేష్, మల్కయ్య, ముంతాజ్ బేగం, శమ్ము, దివ్య, సుధారాణి, రోజా, సాయి, శ్యామ్, రాజు, తుకారం తదితరులు పాల్గొన్నారు.
