- ప్రజలకు దివాళి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఆత్మీయులకు, మిత్రులకు , శ్రేయభిలాషులకు , అధికారులకు, అనాధికారులకు దీపావళి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీపావళి దివ్యకాంతుల వేళా అష్ట లక్ష్ములు మీ గృహములలో నెలవై మీకు సకలశుభాలను , సాహసోపేతమైన విజయాలను , సిరి సంపదలను , సుఖసంతోషాలను , సంవృద్ది , బోగభాగ్యలను ఎల్లవేళలా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలని, వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి అని. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి అని నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని, చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని చెప్పారు. సుఖసంతోషాలతో , కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకంగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.