- అసోసియేషన్ సభ్యులను అభినందించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేస్ 1 లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ( మంచి నీటి శుద్ధి కేంద్రం) ను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసుల తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ లక్ష్మీ విహార్ ఫేస్ 1 లో బోర్ వాటర్ ను శుద్దిచేసి కాలనీ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 10 లక్షల రూపాయల అంచనావ్యయం తో RO ప్లాంట్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, లక్ష్మీ విహార్ కాలనీ ఫేస్ 1 వాసులు అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ఇతర ఇతర కాలనీలకు ఆదర్శముగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. కాలనీలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణంలో నివసిస్తున్నారని, ఎంతో మందికి ప్రేరణగా నిలిచారన్నారు. నీటి బొట్టు ను ఒడిసిపట్టుకొని చక్కగా సద్వినియోగం చేస్తున్న కాలనీ అసోసియేషన్ సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు దాసరి గోపి కృష్ణ , విష్ణు వర్ధన్ రెడ్డి, లక్ష్మీ విహార్ ఫేస్ 1 కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ భూషణం, సభు, మణికంఠ, సోమయాజి, కన్నప్ప కాలనీ వాసులు పాల్గొన్నారు.