ఆరెకపూడి గాంధీకే మా మద్దతు

  • ఆత్మీయ సమావేశంలో అంబేద్కర్ నగర్ కాలనీవాసులు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధి అంబేద్కర్ నగర్ కాలనీలో కాలనీవాసులతో ఆత్మీయ సమావేశం ఆత్మీయంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ  రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండి  అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ  సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన పై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో  అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తానని తెలిపారు.

నా వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు,  శ్రేయభిలాషులకు, కాలనీల అసోసియేషన్ సభ్యులకు,  కాలనీ వాసులకు హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, దాత్రి గౌడ్, నాగరాజు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here