- జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ ని కలిసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, స్థితిగతుల పై చర్చించడం జరిగినదని, ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, కొత్త ప్రతిపాదనల పనులకు నిధులు మంజూరయ్యేలా చూడాలని, చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులలో వేగం పెంచేలా చూడాలని, తదితర అంశాలను చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.