నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్, చండూరు మండలాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్ధతుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ రాజ్య సభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు మొవ్వా సత్యనారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు.