నమస్తే శేరిలింగంపల్లి: భారతరత్న సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారత ఐక్యత దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్ (CAMS) సంయుక్తంగా ఉక్కు మనిషి చరిత్రను కీర్తిస్తూ హైదరాబాద్ లో 31 అక్టోబర్, నవంబర్ 1న పలు చోట్ల వీధి నాటకాలు ప్రదర్శించారు. ఈరోజు CAMS వ్యవస్థాపకుడు డా. అల్తఫ్ హాసన్ సారథ్యంలో శిల్పారామం మాదాపూర్ లో కళాకారులు సాయి కధీర, సురభి దీప్తి, అర్హన్, శంకు, నరేంద్ర జిల్లా, తుడుం మహేశ్ లు సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను ప్రదర్శించారు.