అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • ఆనందోత్సాహాల నడుమ ఆత్మీయ సమావేశం.. అల్పాహార విందు
  • పాల్గొన్న 1816 మంది శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులు

నమస్తే శేరిలింగంపల్లి : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన 1816 మంది శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం ఆనందోత్సాహాల నడుమ అద్భుతంగా జరిగింది. గూడు లేని తమకు సొంతింటి కలను సాకారం చేసి, ఆత్మ గౌరవంగా బతికేలా ఇండ్లు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇందుకు కృషి చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు అల్పాహారం కార్యక్రమం నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, అభివృద్ధి, సంక్షేమం సమానంగా అమలవుతున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక పథకాలలో ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అని అన్నారు.

పేదలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సకల సౌకర్యాలతో డబుల్ ఇండ్లు నిర్మించి, పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా జీవించేలా బాటలు వేశారన్నారు. అక్టోబర్ 2, 5 వ తేదీన మూడవ దశ లో దాదాపు మరో 36,907 ఇండ్లను మరోసారి అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here