నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్ కు 14 వేల ఓట్లను లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రక్రియ అంతా రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. హఫీజ్ పేట్ డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి గా వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, బీజేపీ అభ్యర్థిగా బోయిన అనూష మహేష్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి గా రేణుక, టిడిపి నుండి కుర్ర ధనలక్ష్మి, ఎంసిపిఐ యు అభ్యర్థిగా సుల్తానా బేగం లు పోటీ పడ్డారు.ఈ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్లు 4 రాగా బీజేపీ నాలుగింటినీ సొంతం చేసుకుంది.
తొలి రౌండ్ ముగిసే సరికి ఎన్నికల ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.
టీఆరెస్ -7711
బిజెపి-5035
కాంగ్రెస్-273
టిడిపి -638
సుల్తానా బేగం -24
NOTA-129
చెల్లని ఓట్లు-193
మెజారిటీ- TRS 2676