శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు ప్రజలకు క్రిస్మస్ సందేశాలను ఇచ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎ.నాగన్న, ఎంజే రవికుమార్, రాజు, కృష్ణ, రాణి విక్టోరియా, పాస్టర్ జి.నిరంజన్ ప్రసాద్, కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసీం, ప్రధాన కార్యదర్శి ఎస్.ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం.మోహన్ రావు, రఘురాం, పి.ప్రభాకర చారి, సంయుక్త కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి జడ్.విల్సన్, సంయుక్త కార్యదర్శులు శేఖర్ రావు, రాణి విక్టోరియా, సాంస్కృతిక కార్యదర్శి పద్మ కుమారి, సభ్యులు టి.అముల్ కుమార్, పి.లక్ష్మి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.