ల‌గ‌చ‌ర్ల రైతుల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తి వేయాలి: కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ అణిచివేత విధానాలకు నిరసనగా… రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నానక్ రాంగూడ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తన కార్యకర్తలతో కలిసి రైతులకు బేడీలు వేసిన ఫొటోలతో కూడిన ప్లకార్డులతో నినాదలు చేస్తూ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మాట్లాడుతూ లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేయక తప్పదన్నారు. తొమ్మిదేళ్ల కేసిఆర్ పాలనలో రైతులు ఎ రోజు ఇబ్బంది పడలేదు దేశానికి అన్నం పెట్టె రైతులకు బేడీలు వేయడం అమానవీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు, జంగయ్య యాదవ్,సతీష్ ముదిరాజ్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ, నాగపూరి అశోక్ యాదవ్, జగదీశ్, యాదగిరి, నారాయణ, రమేష్ గౌడ్, శ్రీనివాస్, మధు, సుదర్శన్,నరేష్ సింగ్, సాయిబాబా,రమేష్ గౌడ్, ఖాదర్ ఖాన్, మక్ బూల్,అలీం,తాహెర్, బురాన్, బాలమణి, మొహమ్మద్ అజిజ్,సయ్యద్ అజిజ్,మాధవి, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here