శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుండి రాజ్ భవన్ వరకు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీప దాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర, నియోజకవర్గ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.