చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఈఈ చిన్నారెడ్డిని కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం చిన్నారెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ.. దీప్తి శ్రీ నగర్ కాలనీ, జవహర్ కాలనీ, చందానగర్, విద్యానగర్, గౌతమి నగర్, అమీన్పూర్ 150 ఫీట్ రోడ్, శంకర్ నగర్, టెలిఫోన్ కాలనీ, కైలాష్ నగర్ లలో సీసీ రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయని, కనుక పనులు త్వరగా మొదలు పెట్టి పూర్తి చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.