మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంజిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద సేవా సమితి అనాథ వృద్ధ ఆశ్రమంలో నాయకులు శుక్రవారం పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రంజిత్ రెడ్డికి పాట రూపంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా చిన్నా గౌడ్, డాన్స్ మాస్టర్ రాకేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో లాంచ్ చేశారు. అలాగే వివేకానంద సేవా సమితి ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం అనాథ చిన్నారులు ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిల శ్యామ్ మోహన్, ప్రవీణ్ ముదిరాజ్, టీవీ కృష్ణారెడ్డి, జంషెడ్ పురుషోత్తం, భాస్కర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
