హోటల్ గదిలో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పీజీ వైద్య విద్యార్థిని కొమటి సృజన (27) శుక్రవారం మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. హనుమకొండలో మొదటి సంవత్సరం పీజీ పీడియాట్రిక్స్ చదువుతున్న ఆమె సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం కనిపించకుండా పోయింది. ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మియాపూర్‌లోని హోటల్ గ్రాండ్ బ్రోచిల్‌లోని 502వ గదిని గుర్తించారు. అనంతరం స్పేర్ కీతో గది తలుపు తెరిచి చూడగా.. మంచంపై ఆమె మృతదేహం కనిపించింది.

మృతురాలి తండ్రి కె. భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రవి కుమార్ అనే వ్యక్తి గతంలో సృజన బంగారు గొలుసును తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌కు వచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సృజన మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమె హైదరాబాద్‌కు వచ్చిన కారణాలు, రవి కుమార్‌తో ఉన్న సంబంధం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here