శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరాం నగర్ కాలనీ ఎ బ్లాక్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బలరాం యాదవ్ హాజరై గాంధీజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, శాంతిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని పలువురు పేర్కొన్నారు. యువత గాంధీజీ జీవిత చరిత్రతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలను తెలుసుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజమౌళి రావు, సోమయ్య, వెంకటేశ్వర్లు, దామోదర్ రావు, వెంకటయ్య, నగేష్, మాలకొండయ్య, రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఈరన్న, మహమ్మద్, నాగరాజు, అశోక్, కేదార్, సాయి, సత్యనారాయణ, ప్రేమ్, సాయి చరణ్, బిట్టు, తరుణ్, తిరుమల తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.





