మియాపూర్ లో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు

మొక్కలు నాటుతున్న న్యాయమూర్తి భవాని

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): పెరియార్ ఆర్.వి.రామస్వామి జయంతి వేడుకలను మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి బి.భవాని అనాథ చిన్నారులతో కలిసి పెరియార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మియాపూర్ పొలీస్ స్టేషన్ లో హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ సామల వెంకటేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here