తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే: డా.నారాయణ

సుగుణమ్మను సన్మానిస్తున్న డా.నారాయణ, శోభన్, కమ్యూనిస్ట్ నాయకులు

మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కే నారాయణ అన్నారు. గురువారం మాదాపూర్ డివిజన్ లోని సి ఆర్ ఫౌండేషన్ లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్ శాఖమూరి సుగుణమ్మ ను ఘనంగా సన్మానించారు.. తెలంగాణ సాయుధ పోరులో అమరులైన వారందరికీ నివాళులు అర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం వరకు సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించకపోవడం విచారకమన్నారు. అధికారికంగా నిర్వహించాలని అధికారంలో ఉన్న ఆయా పార్టీలకు మొదటి నుండి సీపీఐ పక్షనా అనేక సార్లు వినితి పత్రాలు ఇవ్వడం జరిగినా కుటిల రాజకీయాలతో పెడచెవిన పెట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తమ పార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన మాటలు గాలికి వదిలేయడంతో బిజెపి మత రాజకీయాలకు ఊతం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఊసేలేని బిజెపి అనేక విముక్తి పోరాటాలను నిర్వహించినట్లుగా చెబుతూ తెలంగాణ పిడిత రైతాంగ పోరాటానికి మత రంగం నులిమి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగోట్టడానికి ప్రయత్నిస్తుందన్నారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ మహతర నైజాం వ్యతిరేక పోరాటానికి అనేక మంది ముస్లింలు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా పోరాటంలో పాల్గొన్నరని చెప్పారు. ఖాసీంరజ్వీ నాయకత్వాన నైజాం ప్రైవేట్ ఆర్మి రజకార్లు సాగించిన ఆగడాలను, అడ్డుకునేందుకు, హత్యకాండను, మత ప్రస్తానం లేకుండా పీడిత ప్రజలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి శోభన్, సిపిఐ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి శ్రీశైలం గౌడ్, నాయకులు కృష్ణ, నరసింహా రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here