శేరిలింగంపల్లి, మే 15 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా శేరిలింగంపల్లి మాదాపూర్ కి చెందిన ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.






