శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌లో కొనసాగుతున్న నూతన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రాంతంలోని పాత డ్రైనేజీ లైన్లు దెబ్బతినడంతో కొంతకాలంగా డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన షేక్ హమీద్ పటేల్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు.

అనంతరం పాత డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నూతన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల ప్రతిపాదనను సిద్ధం చేయించి, అధికారుల ద్వారా మంజూరు పొందేలా చర్యలు తీసుకుని పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, అవి పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎన్. రూపారెడ్డి, డా. రమేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, మంగమ్మ, శ్రీనివాస్ రెడ్డి, అబేద్ అలీ, సంపత్, శేఖర్, రాము, చందు తదితరులు పాల్గొన్నారు.





