శేరిలింగంపల్లి, మే 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సి.వి ఆనంద్ ని హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.






